ఇక నుంచి నేను మంచివాడిగా ఉండబోను: రైఫిల్ పట్టుకుని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక!

  • చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా వ్యవహరించడం లేదని విమర్శ
  • అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో వారికి తెలియడం లేదని వ్యాఖ్య
  • ఈ విషయంలో వారు తెలివిగా వ్యవహరిస్తే బాగుంటుందన్న ట్రంప్
ఇక నుంచి తాను మంచివాడిగా ఉండనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటూ, తాను రైఫిల్ పట్టుకున్నట్లు ఉన్న ఫొటోను ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఆ దేశానికి ఆయన మరోసారి హెచ్చరిక జారీ చేశారు. చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా వ్యవహరించలేకపోతోందని విమర్శించారు. అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో వారికి తెలియడం లేదని అన్నారు.

ఈ విషయంలో వారు తెలివిగా వ్యవహరిస్తే బాగుంటుందని అన్నారు. ఇక మీదట తాను అంత మంచివాడిగా ఉండనని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంబన నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

Trump threatens Iran with AI picture of himself with a gun
Trump threatens Iran
Trump AI Picture

More Telugu News